
అయితే ఇప్పుడు యూట్యూబ్లో కూడా బుజ్జి తల్లి సాంగ్ అదరగొడుతుంది . రీసెంట్ గానే ఇలా ఫుల్ వీడియో సాంగ్ తో మెప్పించిన మరో పాట గేమ్ చేంజర్ లో నానా హైరానా పాట .. ఈ పాటను ముందు థియేటర్ రిలీజ్ లో యాడ్ చేయలేదు .. భారీ బడ్జెట్ తో తీసిన ఈ పాటను అలా ఎలా ఆపేశారా అని ఫీలయ్యారు ఫ్యాన్స్ .. యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం అభిమానులు పండగ చేసుకుంటున్నారు .. గత సంవత్సరం చివర్లో ఇలాంటి సూపర్ డూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న మరో పాట కిస్సిక్ . ముందు నుంచే పుష్పా 2లో స్పెషల్ సాంగ్ కి ఉన్న క్రేజ్ ఆ పాట మీద మరింత హైప్ ని తీసుకొచ్చింది ..
ఇక దానికి తగ్గట్టు శ్రీలీల , బన్నీ స్టెప్పులు సాంగ్ ట్యూన్ లిరిక్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాయి . ఇప్పుడే కాదు ఎప్పుడూ లవ్ సాంగ్స్ కి ఫీల్ గుడ్ సాంగ్స్ కి రొమాంటిక్ సాంగ్స్ కి రిపీటెడ్ ఆడియన్స్ ఉంటూనే ఉంటారు .. అలాగే ఆ వీడియోలు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు .. ఎప్పుడో రిలీజ్ అయిన సీతారామం సినిమాలోని ఇంత అందం పాటను రిపీటెడ్ గా చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు . ఇలా ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ దూసుకుపోతున్న సాంగ్స్ లో ఇవి మొదటి ప్లేస్ లో ఉన్నాయి .