ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలలో అదిరిపోయే రేంజ్ లైనప్ ను సెట్ చేసుకున్న వారిలో నాని , విజయ్ దేవరకొండ ముందు వరసలో ఉన్నారు. నాని గత కొంత కాలంగా వరుస పెట్టి విజయాలను అందుకుంటు వస్తున్నాడు. అలాగే ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే నాని కమిట్ అయిన సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇకపోతే విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు చాలా వరకు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమాలపై , ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాలపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ మూవీలోనూ ,  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ రెండు సినిమాలలో హిట్ ది థర్డ్ కేస్ మూవీ ని మొదట విడుదల చేయనున్నారు. మే 1 వ తేదీన హిట్ 3 మూవీ ని విడుదల చేయనున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మే 31 తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ దాదాపు నెల గ్యాప్ తో తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఏ స్థాయి విజయాలను అందుకుంటాయో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: