పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఆయ‌న దగ్గర్నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పూనకాలే .. ప్రభాస్ కటౌట్ బిగ్ స్క్రీన్  మీద కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు .. థియేటర్లోనే రచ్చ చేస్తారు .. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా హీరో వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు .. ఈ ఊపుతోనే వరుసగా భారీ సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు .. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సలార్ , కల్కి సినిమాలతో పాన్ ఇండియ బాక్సాఫీస్ దగ్గర తానేంటో చూపించాడు ప్రభాస్.. కల్కి సినిమాకి ఏకంగా పై కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి నయా రికార్డును మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు .
 

అయితే ఇప్పుడు ప్రభాస్ నటించిన సినిమాల్లో చత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది .. ఈ సినిమా గూరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా తో ప్రభాస్ స్టార్ డ‌మ్‌ కూడా భారీగా పెరిగింది .. అలాగే ఆయన క్రేజీ కూడా డబుల్‌ అయింది .. ఈ సినిమాల్లో ప్రభాస్ నటన , యాక్షన్ సీన్స్ ఊహించని లెవ‌ల్‌లో ఉంటాయని చెప్పాలి . అయితే ఈ సినిమాలో సూరీడు పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .. తల్లి కొడుకు మాద్య‌ వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను గుండెలు తాకింది ..

సూర్యుడు తల్లిపాత్రలో నటించిన నటి గుర్తుండే ఉంటుంది .. గుడ్డిదానిలా ఆమె నటించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది .. అయితే ఆమె పేరు అనిత చౌదరి .. తన నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించింది అనిత .. మురారి ,సంతోషం ,నువ్వే నువ్వే ఇలా ఎన్నో సినిమాల్లో ఈమె నటించారు .. అయితే ఈమె ఓ స్టార్ హీరోకు చెల్లి .. ఆ హీరో మరెవరో కాదు సీనియర్ హీరో శ్రీకాంత్ .. అనిత చౌదరి భర్త శ్రీకాంత్ కజిన్స్ అవుతారు .. అలా ఈమె శ్రీకాంత్ కు చెల్లి వరస అవుతారు .. ఇదే విషయాన్ని అనిత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది .

మరింత సమాచారం తెలుసుకోండి: