టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే రావు రమేష్ , అన్షు ఈ మూవీ లో అత్యంత కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. 13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 88 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.30 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా 13 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.18 కోట్ల షేర్ ... 10.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 13 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 97 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో 6.15 కోట్ల షేర్ ... 12.54 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 11.20 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 5.15 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవాలని హిట్ స్టేటస్ ను అందుకోవడం కష్టం అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk