
ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నారట. అంతేకాదు సమ్మర్ ఫినిష్ అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడట అల్లు అర్జున్ . ఈ సినిమాలో సమంత - జాన్వి కపూర్ లో హీరోయిన్లుగా సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో రుచి చూడని హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. ఒకవేళ అల్లు అర్జున్ గతంలో ఆ స్టార్ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్ అయి ఉంటే మాత్రం ఎప్పుడో.. ఆ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ఉండేవాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు .
అల్లు అర్జున్ తో - సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీని తెరకెక్కించాలనుకున్నారట . అయితే అల్లు అరవింద్ మాత్రం ఇలాంటి మూవీలో అల్లు అర్జున్ నటించడానికి ఒప్పుకోలేదట . ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అంత అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించిన విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది . ఒకవేళ అల్లు అర్జున్ తెగించి ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం నో డౌట్ పుష్పకి మించిన హిట్ ముందే తన ఖాతాలో వేసుకుని ఉండేవాడు బన్నీ అంటున్నారు అభిమానులు. ఇలాంటి పాత్రల్లో బన్నీ బాగా సూట్ అయ్యేవాడు అని కూడా మాట్లాడుకుంటున్నారు..!