టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా దిల్రుబా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మార్చి 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రచారాలను భారీ ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడంతో ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి వచ్చిన సర్టిఫికెట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు  ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే కిరణ్ అబ్బవరం తాజాగా "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. "క" లాంటి విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో దిల్రుబా మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: