కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విక్రమ్ తాజాగా వీర ధిర శుర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇకపోతే మార్చి 28 వ తేదీన మ్యాడ్ 2 , రాబిన్ హుడ్ సినిమాలు విడుదల కానున్నాయి. కొంత కాలం క్రితం విడుదల అయిన మ్యాడ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మొదటి నుండి కూడా మ్యాడ్ 2 మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఇప్పటికే మ్యాడ్ 2 మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా మేకర్స్ విడుదల చేశారు. అవి కూడా అద్భుతంగా ఉండడంతో మ్యాడ్ 2 మూవీ పై కూడా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఛలో , భీష్మ మూవీలకు దర్శకత్వం వహించి రెండు మూవీలతో మంచి విజయాలను అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. వెంకీ కుడుముల , నితిన్ కాంబోలో కొంత కాలం క్రితం భీష్మ అనే మూవీ రూపొంది మంచి విజయాన్ని సాధించింది. ఇలా వీరి కాంబోలో ఇప్పటికే ఓ మూవీ రూపొంది మంచి విజయం సాధించి ఉండడంతో రాబిన్ హుడ్ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ రెండు తెలుగు సినిమాలు మార్చి 28 వ తేదీన విడుదల కానున్నాయి. దానితో విక్రమ్ నటించిన వీర ధీర శుర మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది అని , లేనట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం కష్టమే అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: