ఇన్నాళ్లు చిరంజీవిని మెగా వారసుడిపై చేసిన కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురి చేశారు. ఇప్పుడు ఈ ఒక హీరోయిన్ విషయం కారణంగా సోషల్ మీడియాలో ఫ్యూచర్ లోనికి గురవుతున్నాడు చిరంజీవి. ఆ హీరోయిన్ మరెవరో కాదు .. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . తెలుగు - హిందీ - తమిళం లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్  గా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా దక్కించుకోలేకపోతుంది .


అయితే చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో మెరవబోతుంది రకుల్ ప్రీత్ సింగ్ అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఆమె నటించబోయేది యంగ్ హీరో సినిమాలో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్నాడు . ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచగా కంప్లీట్ చేసేస్తున్నాడు అనిల్ రావిపూడి . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ చూస్ చేసుకున్నారట . ముందుగా అన్షు ని ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నట్టు టాక్ వినిపించింది .



కానీ అన్షు ఈ సినిమా ని రిజెక్ట్ చేసిందట . ఆ కారణంగానే సెకండ్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  ని ఈ మూవీలో హీరోయిన్గా  చూస్ చేసుకున్నారట. రకుల్సినిమా లో హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది . అయితే రకుల్ ప్రీత్ సింగ్ వయసుకి చిరంజీవికి చాలా చాలా తేడా ఉంది.  కోడలు వయసు ఉన్న హీరోయిన్ తో రొమాన్స్ ఏంటి ..? అంటూ కావాలనే మెగా హెటర్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో చాలామంది హీరోస్  తమ కంటే వయసులో తక్కువైన హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని సక్సెస్ అయ్యారు.



మరి చిరంజీవి అలా స్క్రీన్ షేర్ చేసుకుని సక్సెస్ అవుతాడా..?  లేకపోతే ట్రోలింగ్కి గురవుతూ సినిమాని ఫ్లాప్ చేసే విధంగా ముందుకు వెళ్తాడో ..? అంటూ మాట్లాడుకుంటున్నారు . కానీ అనిల్ రావిపూడి టైమింగ్ రైమింగ్ గురించి అందరికీ తెలిసిందే.  రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.  కచ్చితంగా ఇది ఫుల్ టు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కించేటట్లు అనిల్ రావిపూడి పక్క ప్లాన్ తోనే ముందుకు వెళ్తాడు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: