పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకున్నారు. ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ది రాజా సాబ్ సినిమాలో నటిస్తూనే మరోవైపు ఫౌజి సినిమాలోను నటిస్తూ బిజీగా ఉన్నారు.


అంతేకాకుండా ప్రభాస్ మరోవైపు స్పిరిట్ సినిమాలోనూ నటించడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సందీప్ వంగా దర్శకత్వం వహించబోతున్నారు. సందీప్ వంగా - ప్రభాస్ కాంబినేషన్లో త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ కు డైరెక్టర్ సందీప్ వంగా కొన్ని రకాల షరతులు పెట్టినట్లుగా సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.


స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభించిన అనంతరం ప్రభాస్ ఇతర ఏ సినిమాలోను నటించకూడదని సందీప్ వంగా చెప్పారట. అంతేకాకుండా లొకేషన్ లోకి వచ్చిన అనంతరం బయట ఎక్కడా కూడా ఈ ఆ లుక్ తో కనిపించకూడదని కండిషన్లు పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ కండిషన్లకు ప్రభాస్ కూడా ఒప్పుకున్నారట. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.


అయితే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా త్రిష నటించనున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి మరోసారి వీరిద్దరూ కలిసి స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారని తెలిసి అభిమానులు సంతోషపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. దాదాపు ప్రభాస్ ఒకదాని తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: