ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్సినిమా అనే ప్రశ్నకు ఆర్య సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. అయితే ఆర్య సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరనే ప్రశ్నకు ప్రభాస్ పేరు జవాబు కాగా ప్రభాస్ ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రశ్నకు మాత్రం ఆసక్తికర సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. ఆర్య సినిమా ప్రభాస్ చేసి ఉంటే హిట్టయ్యేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆర్య సినిమా బన్నీ కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. ప్రభాస్ కు ఆర్య కథ నచ్చినా వన్ సైడ్ లవ్ కథాంశం కావడంతో రిస్క్ ఎందుకని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. బన్నీ, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావ బావ అని పిలుచుకుంటారు.
 
ప్రభాస్, బన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఊహించని రేంజ్ లో పాపులారిటీని పెంచుకోవడం జరిగింది. ప్రభాస్, బన్నీ పారితోషికాలు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్, బన్నీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రభాస్, బన్నీ కాంబోలో రాజమౌళి మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.
 
ప్రభాస్, బన్నీ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, బన్నీ భవిష్యత్తు సినిమాలతో ఎన్నో మెట్లు పైకి ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ హీరోలు నిదానంగా సినిమాల్లో నటిస్తున్నా కచ్చితంగా సక్సెస్ సాధించే ప్రాజెక్ట్స్ కు ఓటు వేస్తుండటం గమనార్హం. ప్రభాస్, బన్నీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కూడా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: