ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లోనే ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే అట్లీ , అల్లు అర్జున్ ను కలిసి ఓ కథను కూడా వినిపించినట్లు , ఆ కథ అద్భుతంగా నచ్చడంతో అల్లు అర్జున్ , అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నుండి అల్లు అర్జున్ , అట్లీ కాంబో మూవీకి సంబంధించిన మరో వార్త వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ నటించబోతున్నట్లు , ఈయన పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువగా ఉండనున్నట్లు కానీ సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రగా శివ కార్తికేయన్ పాత్ర ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. దీనితో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో రూపొందబోయే సినిమాలో శివ కార్తికేయన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటే ఆ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయి అని చాలా మంది భావించారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో శివ కార్తికేయన్ ఏ పాత్ర చేయడం లేదు అని తెలుస్తుంది.

ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని సమాచారం. ఇకపోతే పుష్ప లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించనున్న సినిమా కావడం , ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని అట్లీ దర్శకత్వం వహించనున్న సినిమా కావడంతో అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa