
టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఈ సినిమా అనంతరం వరుసగా తెలుగులో సినిమా అవకాశాలను అందుకుంది. కాగా ఈ బ్యూటీ రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమా 2018 మార్చి, 30వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాను కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.... 216 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అప్పట్లో రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాలో జిగేలు రాణి పాట చేసిన చిన్నది పూజ హెగ్డే. అప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పేరు విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ సమయంలోనే పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ చేయడం సంచలనంగా మారింది.
ఈ పాటతో ఈ చిన్నది చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎల్లో కలర్ చీర పల్లెటూరి డ్రెస్సులో ఈ పాటలో ఈ బ్యూటీ కనిపిస్తుంది. ఇక రంగస్థలం సినిమాలో ఈ బ్యూటీ ఐటెం సాంగ్ చేయడంతో సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకు ఈ చిన్నది ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ చిన్నదానికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు.
అలా వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మగా కనిపించిన అనంతరం ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వస్తాయని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ చిన్నదానికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. అంతేకాకుండా తమిళంలో కూడా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఇక పూజా హెగ్డేకి తెలుగులో సినిమా అవకాశాలు రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.