
కొంతమంది సందీప్ రెడ్డివంగ - ప్రభాస్ కాంబోలో రాబోయే స్పిరిట్ మూవీ అంటుంటే .. మరి కొంతమంది మహేష్ బాబు - రాజమౌళి సినిమా అంటున్నారు. కాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి తలదన్నే రేంజ్ లో మరొక మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు బడా ప్రొడ్యూసర్ ఈ కామ్మో సెట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య అదే విధంగా అల్లు అర్జున్ ల ను హీరోలుగా పెట్టి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ బిగ్ బడా మల్టీస్టారర్న్ మూవీని ప్లాన్ చేయబోతున్నారట దిల్ రాజు.
ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధంగా ఉన్నారట . సినిమా చరిత్రని తిరగరాసే విధంగా ప్రశాంత్ నీల్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయాలి అంటూ దిల్ రాజు ముందే చెప్పేశారట. ఈ క్రేజీ కాంబో ని సెట్ చేసే పనిలో బిజీ అయిపోయాడు దిల్ రాజు అంటూ బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ కి అమ్మ మొగుడు లాంటి సినిమా రాబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది..???