టాలీవుడ్ యువ నటుడు నితిన్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. రాజేంద్రప్రసాద్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే నితిన్ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. అలాగే శ్రీ లీలా కి కూడా వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటుంది. ఇలా వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన నితిన్ , శ్రీ లీలా కాంబోలో వచ్చిన ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే మళ్లీ వీరిద్దరూ ఫుల్ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి రాబిన్ హుడ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ... ఆ మూవీ ద్వారా నితిన్ , శ్రీ లీలా కి ఏ రేంజ్ క్రజ్ వస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు.

అందులో భాగంగా నితిన్ మాట్లాడుతూ ... ఈ మధ్య కాలంలో నాకు బాగా ఫ్లాప్స్ వచ్చాయి. నేను ఆఖరుగా నటించిన సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. శ్రీ లీలా కి కూడా అదే ఆఖరి. ఆ సినిమా ద్వారా ఆమెకు కూడా ఫ్లాప్ వచ్చింది. ఇక రాబిన్ హుడ్ సినిమా ద్వారా మా ఇద్దరిదీ హిట్ పెయిర్ అని అందరూ మాట్లాడుకుంటారు అని నితిన్ తాజా ఈవెంట్లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: