తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన కేవలం సినిమాల్లో హీరోగా నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని నిర్మాతగా కూడా తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఆఖరుగా డెవిల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.ఇకపోతే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అర్జున్ S /O వైజయంతి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ ను మార్చి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్నాడు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే విజయశాంతి "సరిలేరు నీకెవ్వరు" సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చి నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr