తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయన పలకనామా దాస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించి నటుడిగా , దర్శకుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత కూడా ఈయన సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు  అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో విశ్వక్ సేన్ తెలుగు సినీ పరిశ్రమలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వక్ కేవలం పలకనామ దాస్ మూవీకే కాకుండా దాస్ క దమ్కి అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించి ఆ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా మరోసారి కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే నటుడిగా , దర్శకుడిగా కెరియర్ను మంచి దశలో కొనసాగిస్తున్న సమయం లోనే ఈయన వరుస అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొంత కాలం విశ్వక్ సేన్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక ఆ తర్వాత మెకానిక్ రాఖీ సినిమాతో ఈయనకు అపజయం దక్కింది. ఇక తాజాగా ఈయన లైలా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ మాత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ సినిమా తాజాగా ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన చాలా సినిమాలకు ఓ టీ టీ లో మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. అలా లైలా మూవీ కి కూడా ఓ టీ టీ లో అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ కి ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs