టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి నీతిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో నితిన్ వరుస అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. నితిన్ కొంత కాలం క్రితం మాచర్ల నియోజకవర్గం అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఇలా వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్న నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో రాబిన్ హుడ్ సినిమా ముందు విడుదల కానుంది. రాబిన్ హుడ్ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను భారీ ధరకు జీ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత జీ 5 ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు , ఆ తర్వాత కొన్ని వారాలకు ఈ సినిమాను జీ తెలుగు ఛానల్ లో ఈ మూవీ నుంచి సంస్థ వారు ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: