టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన ఎంతోమంది హీరోలకు డబ్బింగ్ చెప్పడమే కాకుండా తన డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. తాజాగా సాయికుమార్ కు కొమరం భీమ్ పురస్కారం దక్కినట్లు తెలుస్తోంది. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించిన సాయికుమార్ బడా హీరోలకు సైతం తన వాయిస్ ని అందించారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పి మంచి పేరు సంపాదించారు. దీంతో సాయికుమార్ కు 2024 సంవత్సరానికి గాను కొమరం భీమ్ పురస్కారానికి ఎంపికైనట్లు తెలుస్తోంది.



ఈ విషయాన్ని కొమరం భీమ్ పురస్కార సెలక్షన్ చైర్మన్ సి పార్థసారథి వెల్లడించారు. గత 12 ఏళ్లుగా ఇండియన్ కల్చర్ అకాడమీ ఇతరత్రా  అకాడమీతో సంయుక్త నిర్వహణలో ఈ అవార్డులను సైతం అందిస్తున్నారు.. ఈ అవార్డులను సుద్దాల అశోక్ తేజ, రాజేంద్రప్రసాద్, గూడ అంజయ్య మరి కొంతమంది దిగ్గజలకు సైతం ఈ పురస్కారం ఇవ్వబడిందట. అయితే ఈ అవార్డు తో పాటుగా జ్ఞాపికను , 50వేల రూపాయలు నగదు కూడా అందిస్తారట.


మార్చి 23వ తేదీన ఈ పురస్కారానికి సంబంధించి కార్యక్రమం జరుగుతోందట. కొమరం భీమ్ జిల్లా అయినా ఆసిఫాబాద్ కేంద్రంలో జరగబోతోందట. అయితే అక్కడికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారని సమాచారం. ఈ సందర్భంగా గిరిజన కళాకారులతో పాటుగా గిరిజన సాంప్రదాయాలకు సంబంధించిన నృత్య ప్రదర్శన కూడా అక్కడ ఆకర్షణీయంగా నిలుస్తుందని తెలియజేస్తున్నారు. అయితే సాయి కుమార్ కు కొమరం భీమ్ అవార్డు రాబోతోందని తెలిసి అభిమానులైతే ఆనందపడుతున్నారు. ఈ మధ్యకాలంలో సాయికుమార్ తండ్రి పాత్రలలో అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా అద్భుతమైన పాత్రలో నటించిన సాయికుమార్ రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈయన కుమారుడు ఆది మాత్రం హీరోగా సక్సెస్ కాలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: