తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతలలో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. సూర్య దేవర నాగ వంశీ తన బ్యానర్ అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మధ్యకాలంలో వరస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈయన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలలో చాలా వరకు మంచి విజయాలను అందుకుంటూ వెళ్లడంతో ఈయనకు , ఈయన బ్యానర్ కు అద్భుతమైన క్రేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో దక్కుతుంది. తాజాగా నాగ వంశీ నిర్మించిన ఓ రెండు సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ ను అందుకున్న టాప్ 10 మూవీలలో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? ఎన్ని వ్యూస్ ను ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో దక్కించుకొని ఇండియాలోనే టాప్ 10 స్థానెలలో నిలిచాయి అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో తాజాగా డాకు మహారాజ్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశం నిర్మించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో 5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న టాప్ 10 ఇండియన్ మూవీస్ లో డాకు మహారాజు సినిమా 4 వ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ అనే సినిమాను కూడా రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న టాప్ 10 ఇండియన్ మూవీస్ లో 9 వ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఇలా సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన డాకు మహారాజ్ , లక్కీ భాస్కర్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: