టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. దాదాపు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన ఈ చిన్నది సినిమాలు చేసింది. అంతేకాకుండా సమంత నటన, అందానికి గాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది.


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత కొనసాగుతున్నారు. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సమంత వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే అక్కినేని నాగచైతన్యను ప్రేమించిన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట అతి తక్కువ సమయంలోనే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. నాగ చైతన్య కూడా సినిమాలలో నటిస్తున్నారు.


అంతేకాకుండా చైతు రీసెంట్ గానే శోభిత దూలిపాళ్లను ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు. కానీ సమంత ఇప్పటికీ సింగిల్ గానే తన లైఫ్ ను సంతోషంగా కొనసాగిస్తోంది. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా విపరీతంగా లైక్స్ వస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.



సమంత సినిమాల్లోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓ దర్శకుడు సినిమా అవకాశాలు ఇస్తానని ఆఫర్ చేశారట. కానీ నేను చెప్పినట్టు చేయాలని కండిషన్ పెట్టాడట. దానికి సమంత ఒప్పుకోలేదట. అయినప్పటికీ ఆ దర్శకుడు సమంతను చాలా ఇబ్బంది పెట్టాడట. ఈ విషయం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: