
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నమ్రత వివాహం తర్వాత ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించింది. ఇక నమ్రత తన భర్త, పిల్లల బాధ్యతలను దగ్గర ఉండి మరి చూసుకుంటుంది. అయితే మహేష్ బాబు సినిమాల ఎంపిక విషయంలో నమ్రత కీలక పాత్ర పోషిస్తుందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. అయితే మహేష్ బాబు సినిమాలలో రొమాన్స్ ఎక్కువగా ఉండకూడదని చెబుతూ ఉంటుందట.
అంతేకాకుండా మహేష్ బాబుకి సినిమాలలో లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు అసలు ఎక్కువగా ఉండకూడదని నమ్రత గతంలోనే చెప్పారట. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేస్తున్న సమయంలో నమ్రత.... హీరోయిన్ సమంతకు వార్నింగ్ ఇచ్చారట. తన భర్తతో క్లోజ్ గా ఉండకూడదని కొన్ని కండిషన్లు కూడా పెట్టారట. అయితే నమ్రత అలా వార్నింగ్ ఇవ్వడంతో సమంత కాస్త ఫీల్ అయ్యారట.
ఆ తర్వాత సమంత కొద్ది రోజులపాటు హీరో మహేష్ బాబుతో మాట్లాడడం మానేసినట్లుగా ప్రచారాలు వచ్చాయి. ఆ కారణంగానే మహేష్ బాబుకి, సమంతకు మధ్య కొన్ని గొడవలు జరిగాయట. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై నమ్రత స్పందిస్తారో లేదో చూడాలి.