టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంత మంది హీరోయిన్లు మాత్రమే వారి సినిమాల ద్వారా ఎనలేని గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో నటి త్రిష కృష్ణన్ ఒకరు. ఈ బ్యూటీ సినిమాల్లోకి పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.


తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. త్రిష సినీ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగుతోంది. కానీ తన వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఈ బ్యూటీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. కానీ కొంతమంది హీరోలతో ఫైర్లు కొనసాగించినట్లుగా ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇంతవరకు త్రిష ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 40 కి పైనే ఉన్నప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ తనదైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


కాగా, ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ అర్ధరాత్రి సమయాల్లో తన స్నేహితులతో ఫోన్ కాల్స్ మాట్లాడుతుందట. తన స్నేహితులతో ప్రతిరోజు ఫోన్ కాల్స్ మాట్లాడకపోతే తనకు అసలు నిద్ర పట్టదట.


రోజంతా బిజీగా ఉండడం వల్ల అర్థ రాత్రి వీలు కుదిరినప్పుడు తన స్నేహితులతో కలిసి సరదాగా కాసేపు ఫోన్లో కబుర్లు చెప్పుకొని త్రిష నిద్రపోతుందట. ఈ విషయాన్ని త్రిష స్నేహితురాలు చెప్పడం ద్వారా ఈ విషయం బయటపడింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ త్రిష వారితో ఫోన్ కాల్స్ మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని త్రిష స్నేహితులు అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: