తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాకు చాటి చెబుతూ .. తెలుగు చిత్ర పరిశ్రమని మరో లెవల్ కు తీసుకువెళ్లారు దర్శక ధీరుడు రాజమౌళి .. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలతో విదేశాల్లో తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ క్రియేట్ చేశాడు రాజమౌళి . ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు ఇతర దేశాల్లో ఎలాంటి  క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ప్రధానంగా జపాన్లో మన సినిమాలను ఎగబడి మరీ చూస్తున్నారు. ముందుగా జ‌పాన్‌లో రజినీకాంత్ కు భారీ క్రేజ్ ఉంది .. 1995లో ముత్తు రిలీజై అక్కడ ప్రభంజనం సృష్టించింది .. ముత్తు సినిమాకు కలెక్షన్ వర్షం కురిసింది .. అప్పటినుంచి రజనీకి భారీ అభిమానులు అక్కడ క్రియేట్ అయ్యారు .. అలాగే రజనీకాంత్ సినిమా రిలీజ్ అయింది అంటే జపాన్ లో కూడా హడావుడి ఉంటుంది . ఆ తర్వాత బాలీవుడ్ హీరోలు బాగా పాపులర్ అయ్యారు.. ఇక బాహుబలి సినిమాల తర్వాత నుంచి కూడా తెలుగు హీరోల వంతు వచ్చింది .


అడుగు పెట్టడమే లేట్ అన్నట్టు అప్పటినుంచి తెలుగు హీరోల సినిమాలకు కలెక్షన్లు అదరగొడుతున్నాయి .. ప్రస్తుతం జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 5 ఇండియన్ సినిమాల లిస్టు చూస్తే .. త్రిబుల్ ఆర్ 2400 మిలియన్ల జపనీస్ డాలర్స్ ని కలెక్ట్ చేసి నెంబర్ వన్ స్థానంలో ఉంది .. ఆ తర్వాత 305 మిలియన్ డాలర్లతో బాహుబలి 2 స్థానంలో ఉంది .. ఆ తర్వాత 45 మిలియన్ డాలర్స్ లో రజనీకాంత్ ముత్తు మూడో స్థానంలో ఉంది .. 170 మిలియన్ డాలర్స్ తో బాలీవుడ్3 ఇడియట్స్ మూవీ 4 స్థానంలో ఉంది .. దివంగత శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్  160 మిలియన్ డాలర్స్ తో జపాన్ లో 5 స్థానంలో ఉంది .


త్రిబుల్ ఆర్ సినిమాతో జ‌పాన్‌లో ఎన్టీఆర్ , రామ్ చ‌రణ్ లకు భారీ క్రేజీ వచ్చింది .. రీసెంట్ గానే చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా జపాన్లో రిలీజై 40 మిలియన్ డాలర్లు రాబట్టండి .. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన దేవర సినిమాని జపాన్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు .. ఈనెల 28న దేవర సినిమా జపాన్లో రిలీజ్ కాబోతుంది .. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయి .. ఎన్టీఆర్ సైతం పలు జపాన్ టీవీ చానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు దేవర సినిమాతో ఎన్టీఆర్ జ‌పాన్‌లో ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తారు .. అక్కడ ఇండియన్ సినిమాల కలెక్షన్లను బీట్ చేసి టాప్ లో నిలబడతారా అన్నది చూడాలి .. తెలుగులో దేవర రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది . కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది .. జపాన్ లో కూడా ఎన్టీఆర్ ఈ మ్యాజిక్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: