టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇక మరి కొంతమంది ఎన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేక పోతారు. అలాంటి వారిలో నటి ఎస్తర్ నోరోన్హా ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2013 సంవత్సరంలో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా చేసిన "1000 అబద్ధాలు" అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది.


ఈ సినిమాలో ఎస్తర్ నటన బాగున్నప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు అందుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే అవకాశాలను అందుకుంది. అనంతరం జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, జయ జానకి నాయక లాంటి సినిమాలలో నటించింది. చివరిగా ఈ బ్యూటీ కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన డెవిల్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.


అయితే ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే టాలీవుడ్ సింగర్, ప్రముఖ యాక్టర్ నోయల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతనితో ఈ బ్యూటీ ప్రేమలో పడి వివాహం చేసుకుంది. 2019లో ఘనంగా వివాహాన్ని జరుపుకున్నారు. కానీ అతి తక్కువ సమయంలోనే వీరి వివాహ బంధం ముగింపు పలికింది. మనస్పర్ధల కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. కేవలం 6 నెలల సమయంలోనే వారి వైవాహిక జీవితానికి వీడ్కోలు పలికారు. అయితే విడాకుల అనంతరం ఎస్తర్ తరచూ వార్తల్లో నిలిచింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి సంబంధించి మరికొన్ని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.


నటి ఎస్తర్ టాలీవుడ్ లో ఉన్న ఓ యంగ్ హీరోతో రిలేషన్ కొనసాగిస్తుందట. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు, అంతేకాకుండా ఎఫైర్ పెట్టుకున్నట్లుగా ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఎస్తర్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: