టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరుపొందిన దిల్ రాజు ప్రస్తుతం పలు చిత్రాల సీక్వెల్స్ తెరకెక్కించే పనిలో పడ్డారట.. ఇటీవలే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిల్ రాజ్ ఇందులో సంక్రాంతి వస్తున్నాం ఫ్యామిలీ సినిమా కావడం చేత భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించిన ఈ చిత్రం వెంకీ కెరియర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది. అలాగే 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిలిచింది.


ఫిబ్రవరి 7న దిల్ రాజ్ తాను 12 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని భావన తనలో ఎంతో కాలంగా ఉన్నదని.. అయితే ఈ సీక్వెల్ భారం అంతా కూడా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకే అప్పగించాడట దిల్ రాజు.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తరహాలోనే అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే కథ అయితే బాగుంటుందని భావించారట.


అలాగే శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి సినిమాకి కూడా దిల్ రాసే నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును కూడా తీసుకువచ్చేలా చేసింది. దీనికి సీక్వెల్ కూడా తీయాలని దిల్ రాజ్ గత కొంతకాలంగా ప్లాన్ చేశారు. డైరెక్టర్ సతీష్ వేగ్నేశ తో శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనే పేరుతో తీయబోతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు గురించి ఊసే లేదు. ప్రస్తుతమైతే శ్రీకాంత్ అడ్డాలను దిల్ రాజు కథ పైన సీరియస్ గా కూర్చొని రాయమని కోరినట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ సతీష్ తో కూడా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అనే చిత్రాన్ని కూడా ఫైనల్ వర్షన్ ను ప్రత్యేకమైన దృష్టితో రాయించేలా చేస్తున్నారట. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఈ సినిమాలు రెండు సెట్స్ మీదికి వచ్చే అవకాశాలు ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: