
చంద్రబోస్ కు ఐటమ్ సాంగ్స్ లో కొత్త స్టైల్ ఉంది .. సుకుమార్ సినిమాల్లో ఆది కనిపిస్తుంది .. ఓ కొత్త కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుగుణంగా ఆయన రాసుకుంటూ వెళతాడు .. పుష్ప 1లో ఉ అంటావా మామ పుష్పా2లో దెబ్బలు పడితాయ్ . ఈకోవలోకి వస్తాయి .. ఇప్పుడు అదిరా సర్ప్రైజ్ కూడా ఆ విధంగా చంద్రబ్రస్ కు ఓ ప్లస్ పాయింట్ .. ఎవరు ఏమనుకున్నా .. శేఖర్ మాస్టర్ కంపోజింగ్ మరో లెవెల్ .. ఎవరు ఎంత తిట్టుకున్న డాకు మహారాజ్ స్పెషల్ సాంగ్ విపరీతంగా వైరల్ అయింది .. ఇక ఇప్పుడు రాబిన్ హుడ్ సాంగ్ కూడా అదే క్రేజీ మూమెంట్స్ కంపోజ్ చేశాడు .. ఇప్పుడు ఆ మూమెంట్స్ అన్ని వైరల్ గా మారుతున్నాయి .. భారీగా సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి .
ఇందులో మూడో ఫ్యాక్టర్ కేతిక శర్మ .. పాటకు శేఖర్ మాస్టర్ ఇచ్చిన మూమెంట్స్ కు మరింత అందాన్ని జోడించి ఇంప్రూవ్ చేసి మెలికలు ఇరగదీసింది ఆ మూమెంట్స్ అన్నీ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారాయి రాబిన్ హుడ్ ను ట్రెండింగ్ లోకి తెచ్చేసాయి . ఇక పాట సంగతి ఇలా ఉంటే నిన్న జరిగిన మీడియా మీట్‌లో హీరో నితిన్ ,దర్శకుడు వెంకీ కడుముల .. రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు కూడా సినిమా మీద భారీ నమ్మకాన్ని పెంచాయి .. ఇలా మొత్తం మీద రాబిన్ హూడ్ ఇప్పుడు నేను కూడా బాక్సాఫీస్ పోటీలో ఉన్నానని ముందు వరుసలోకి వచ్చేసింది . అయితే ఈ సినిమాకు పోటీగా మ్యాడ్ 2 తో పాటు మరో 7 సినిమాలు విడుదలవుతున్నాయి .. ఏ సినిమాకు అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.