
అలాంటి ఎంతో సెంటిమెంట్ ఇంటిని మరో ఆలోచన లేకుండా అమ్మేసింది సోనాక్షి . ఇక దీనికి కారణం ఆమె భారీ పెట్టుబడి వ్యూహమే .. అలా వచ్చిన డబ్బుతో దుబాయిలో ఫ్యాక్టరీ కొనేందుకు ఈమె ప్లాన్ చేస్తుంది . అదే విధంగా రీసెంట్గా అమితాబచ్చన్ కూడా ముంబైలో కొన్ని ఆస్తులను అమ్మేశారు .. అలా అమ్మి వచ్చిన డబ్బును గుర్గావ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో పెట్టుబడిగా పెట్టబోతున్నాడు అమితాబ్ .. ప్రస్తుతం అక్కడ బూమ్ భారీగా ఉంది .. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ను తలపించే విధంగా అది ఫ్యూచర్లో మారబోతుంది .. అలాగే మరో హీరో , హీరోయిన్ ప్రియాంక చోప్రా , అక్షయ్ కుమార్ కూడా తమ ఆస్తులను అమ్మేసుకున్నారు .. వీళ్లది కూడా ఇదే రూట్ ..
ముంబైలోని మరో ఖరీదైన ప్రాంతంలో లగ్జరీ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేందుకు అక్షయ్ కుమార్ తన పాత ఆస్తులుని అమ్ముకోగా .. లాస్ ఏంజెల్స్ లో పెట్టుబడుల కోసం ప్రియాంక చోప్రా ముంబైలో ఆస్తుల్ని అమ్ముకుంది . ఇలా నటీనటులు తమ ఆస్తులను అమ్ముకోవడం వెనక పెట్టుబడి తప్ప ఆర్థిక నష్టాలు ఏమీ లేవు .. ఇలా చాలామంది కొత్త కొత్త కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతుంటే సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ మాత్రం పాత సెంటిమెంట్ నే ఫాలో అవుతూ వస్తున్నారు .. షారుక్ తన మన్నత్‌ను ఆధునికరించే పనులు మొదలుపెట్టాడు .. సల్మాన్ గేలక్సీ ని వదిలి బయటకు రాను అంటున్నాడు ..