
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది యంగ్ హీరోలు , స్టార్ హీరోలు ఉన్నారు .. ఈ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని , అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు .. ఒకప్పుడు ఇద్దరు కలిసి ఓ సినిమాలో కూడా నటించారు .. అయితే ఆ సినిమా తర్వాత ఇద్దరు తమ తమ ఇతర సినిమాల్లో ఫుల్ బిజీగా అయిపోయారు .. ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలు ఎప్పుడు రచ్చ జరుగుతూనే ఉండేది . అయితే ఇప్పుడు చాలా రోజులకు మళ్ళీ ఫైనల్ గా అందరికీ ఈ ఇద్దరు యంగ్ హీరోలు భారీ స్వీట్ షాక్ ఇచ్చారు .. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన క్లాసికల్ హిట్ సినిమా ఎవడే సుబ్రమణ్యం మరోసారి రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే ..
అయితే ఈ సినిమా మళ్లీ విడుదల కోసం ఈ యంగ్ హీరోలు ఒకటి గా కనిపించారు . ఈ సినిమాలో ఒక ఐకానిక్ సిన్‌ను రీ క్రియేట్ చేసిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు . నాని ప్రస్తుతం హిట్ 3 లుక్ లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ లుక్ లో బైక్ మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నారు .. ఈ ఇద్దరి తో పాటు గా నంది అదే మాళవిక నైర్ కూడా వీరి తో కనిపిస్తుంది .. ఇక దీంతో ఈ స్పెషల్ పిక్ ఒకసారి గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. అయితే ఈ సినిమాని కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ... ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మించారు .. ఇక మరి ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .