గత రెండు మూడు రోజుల నుంచి అనూహ్యంగా మోహన్ బాబు, సౌందర్య పేరు తెరమీదకి రావడం జరిగింది. సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నిరసనను తెలియజేస్తూ కలెక్టర్ కి  కంప్లీట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మోహన్ బాబు ఉంటున్నటువంటి జల్లిపల్లి లోని ఫామ్ హౌస్ ని కూడా అదుపులోకి మోహన్ బాబు తీసుకున్నారని అది అక్రమంగా అనుభవిస్తున్నారంటూ ఫిర్యాదులో కూడా తెలియజేశారు. ఈ విషయంపైన సౌందర్య భర్త స్పందించడం జరిగింది.

గత కొద్ది రోజులుగా హైదరాబాదులో ఉండే ఒక ప్రాపర్టీ గురించి అటు మోహన్ బాబు సౌందర్య పేర్లు అనవసరంగా వినిపించేలా చేస్తున్నారని ప్రాపర్టీ గురించి ఇవన్నీ కూడా ఆధారాలు లేని వార్తలు తన భార్యకు చెందినటువంటి ఎలాంటి ఆస్తిని కూడా మోహన్ బాబు ఇల్లిగల్గా స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. తనకు తెలిసినంతవరకు తమ కుటుంబంతో ఎలాంటి ఆస్తి లావాదేవీలు కూడా లేవని తెలిపారు సౌందర్య భర్త. సౌందర్యం మరణించిన కూడా తనకు మోహన్ బాబు గారితో 25 ఏళ్లకు పైగా మంచి స్నేహబంధం ఉన్నదని తెలిపారు.


నా భార్య, అత్తగారు, బావమరిది ఎప్పుడూ కూడా ఆయనతో స్నేహం గానే ఉన్నారని ఈ విషయంలో ఆయనకు అండగా తాను నిలుస్తానంటూ తెలిపారు.. మాకు మోహన్ బాబు కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు సైతం లేవని ఆధారాలు లేని వార్తలు కాబట్టి దయచేసి ఎవరూ కూడా ఇలాంటి విషయాలను వైరల్ గా చేయకండి అంటూ ఒక లేఖను విడుదల చేశారు సౌందర్య భర్త. ఇక సౌందర్య ఆమె మరణానికి ముందు రఘు జిఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైతం వివాహం చేసుకోవడం జరిగింది.. ఆమె ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఉండగా హెలికాఫ్టర్ ప్రమాదం జరగడంతో కన్ను మూసింది సౌందర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: