గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో “ గేమ్ ఛేంజర్ “ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేసాడు..ఈ సినిమాసంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ప్రేక్షకులు ఉహించుకున్న స్థాయి లో సినిమా లేకపోవడం తో గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని రాంచరణ్ ప్రయత్నిస్తున్నాడు..

 రాంచరణ్ ప్రస్తుతం తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయి శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నారు..ఇదిలా ఉంటే ఈ సినిమా బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ సుకుమార్  సినిమా లో బిజీ కానున్నాడు..
అయితే ఆ సినిమా కి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ లోపు చరణ్ మరో సినిమా చేయాలని చూస్తున్నాడు..టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉండడంతో చరణ్ బాలీవుడ్ వైపు  దృష్టి సారించినట్లు తెలుస్తుంది..
తనకి అత్యంత సన్నిహితుడు అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

రాంచరణ్ కి మధు మంతెన తో మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది. ముంబై వెళ్ళినప్పుడల్లా మధు మంతెన ను కలవకుండా మాత్రం తిరిగి రారు. ప్రస్తుతానికి మధు మంతెన ఒక భారీ మూవీ స్క్రిప్ట్ చరణ్ కోసం సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం.బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: