
ప్రస్తుతం అనూపమా పరధా అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది ఈ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం జరుగుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రంలోనే సమంత కూడా గెస్ట్ రోల్ లో కనిపించేలా అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుపమ ,సమంతకు కూడా మంచి స్నేహబంధం ఉన్నదట. ఈ సినిమా కోసం అనుపమ స్వయంగానే సమంతని రిక్వెస్ట్ చేయడంతో ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత సుమారుగా 10 నిమిషాల పాటు అనుపమ నటిస్తున్న పరధా సినిమాలో ఉండే అవకాశం ఉన్నదట. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వవలసి ఉన్నది. అనుపమ పరమేశ్వరన్ కూడా కెరియర్ ప్రారంభంలో డైరెక్టర్ త్రివిక్రమ్ తీసిన ఆ ఆ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన అందులో హీరోయిన్గా కూడా సమంత నటించిన అప్పటినుంచి అటు సమంత ,అనుపమ మధ్య మంచి స్నేహబంధం ఉందని మళ్లీ ఆ తర్వాతే ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఈ విషయం తెలిసి అభిమానులైతే ఆనంద పడుతున్నారు ఒకవేళ ఈ గెస్ట్ రోల్ సక్సెస్ అయితే అటు అనుపమ, సమంత కెరియర్ మారిపోతుందనే విధంగా తెలుపుతున్నారు.