
ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన సోనీ లీవ్ లో రేఖాచిత్రం సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మలయాళం సినిమా. కానీ ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కేవలం తెలుగు బాషలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదల అయ్యింది. థియేటర్ లలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
రేఖాచిత్రం సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి తెలుగు వెర్షన్ లో రిలీజ్ కానుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా ఆహాలోకి రానుంది. ఇక ఈ సినిమా ఒక అమ్మాయి హత్యకి సంబంధించిన చిత్రం. ఈ సినిమాని డైరెక్టర్ జోఫిన్ టి. చాకో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కావ్య ఫిల్మ్ కంపెనీ, ఆన్ మెగా మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ జయన్, సిద్దిక్, జగదీష్, సాయి కుమార్, హరిశ్రీ ముఖ్యపాత్రలలో నటించారు.