
అయితే ముఫాసా ది లయన్ కింగ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వేచి చూస్తున్నారు. అయితే ఈ వెయిటింగ్ కి శుభ కార్డ్ పడింది. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. జియో హాట్ స్టార్ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా ఓటీటీలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం సినీ ప్రియులు, జంతు ప్రియులు వెంటనే వెళ్లి చూసేయండి.
ఇక ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఈ వారం థియేటర్ లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.