
ఇప్పటి ప్రేక్షకులకు నారాయణమూర్తి అంటే పెద్దగా తెలియదేమో కానీ .. 90 స్ వారిని అడిగితే ఆయన ఎవరో పూర్తిగా తెలుస్తుంది .. చిరంజీవి , బాలకృష్ణ లాంటి హీరోలు కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో కూడా తనదైన రూట్ లో సినిమాలు చేస్తూ సూపర్ విజయాలు అందుకున్న హీరో ఈయన .. కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు నారాయణమూర్తి . అయితే తాజాగా నాని పారడైజ్ సినిమాలో నారాయణమూర్తి గారికి ఓ అద్భుతమైన పాత్రను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. మీరు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేస్తారు అంటూ శ్రీకాంత్ స్వయంగా వెళ్లి నారాయణ మూర్తిని అడిగారట .. హీరోతో సమానమైన పాత్ర మీది అని దాని గురించి ఆయనకి వివరించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . అయితే కథ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆ పాత్ర చేయడానికి నారాయణమూర్తి ఒప్పుకుంటాడా అనేది అసలైన డౌట్ ..
ఎందుకంటే తన సొంత నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర బ్యానర్స్ తప్ప బయట సినిమాలు చేయడం మానేసి దాదాపు 35 సంవత్సరాల అయింది .. 1985 ఈ తరం బ్యానర్ లో వచ్చిన అర్ధరాత్రి స్వతంత్రం తర్వాత బయట నిర్మాతలకు సినిమాలు చేయటం లేదు నారాయణమూర్తి .. తన గురువు దాసరి నారాయణరావు కోసం అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రలో మాత్రమే ఆయన నటించరు . ఒక్కసారి తన సొంత బ్యానర్ స్థాపించిన తర్వాత కమర్షియల్ సినిమాల జోలికి అలాంటి పాత్రలవైపుకు వెళ్లలేదు నారాయణమూర్తి .. ఎంతమంది ఎలాంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా నారాయణమూర్తి వాటికి నో చెబుతూనే వచ్చాడు .. అయితే ఇప్పుడు నాని సినిమాకు ఓకే చెప్తాడా అనేది అంతుచిక్కని ప్రశ్న .. ఎందుకంటే పదేళ్ల క్రితం వచ్చిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణ మురళి పాత్ర కోసం ముందుగా నారాయణ మూర్తిని అడిగారు పూరి జగన్నాథ్ . అలాగే ఆ పాత్ర కోసం ఏకంగా ఊహించని అమౌంట్ ని కూడా ఆఫర్ చేశారు .. కానీ తాను చేయను అని సున్నితంగా ఆఫర్లు తిరస్కరించాడు నారాయణమూర్తి .. ఆయన నో చెప్పినా కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో పోసాని పాత్రకు మూర్తి అనే పేరు పెట్టాడు పూరి .. ఇక అప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసమే ఎక్కడా టెంట్ అవలేదు నారాయణమూర్తి .. కానీ ఇప్పుడు నాని సినిమా కోసం అడిగితే వస్తాడా.. ఒకవేళ పారడైజ్ సినిమాలో నారాయణమూర్తి నటిస్తే అంతకంటే గొప్ప సంచలనం మరొకటి ఉండదు .. నాని , శ్రీకాంత్ ఓదెల ఏం చేస్తారు చూడాలి.