
అయితే విష్ణు గత చిత్రాలను చూసి బయ్యర్స్ అడిగినంత డబ్బులు పెట్టి ఈ సినిమాని కొనే స్థితిలో లేరని తెలుస్తుంది..ఈ సినిమాను కొనేందుకు వున్న ఏకైక హోప్ ప్రభాస్..కానీ ఇక్కడ ప్రభాస్ వున్నా కూడా ఈ చిత్రానికి ఆశించిన రేంజ్ లో బజ్ లేదన్నది వాస్తవం ఉపయోగపడలేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. రీసెంట్ గానే మంచు విష్ణు నెట్ ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ సంస్థలతో డీల్ పెట్టుకోవడానికి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ఈ సంస్థలు ముందుకు రావడం లేదని సమాచారం.. ఒకవేళ ఆయన అడిగిన ప్రైజ్ కి సినిమాని కచ్చితంగా కొనుక్కోవాలంటే, సినిమాకి సంబంధించిన ప్రివ్యూ ని చూపించమని అడుగుతున్నారట.. అయితే మంచు విష్ణు ఆ ప్రతిపాదనకు నిరాకరించాడని సమాచారం.
.నా సినిమా కంటెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది..అసలు ఈ చిత్రాన్ని విడుదలకు ముందు ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మాలని మేము అనుకోవట్లేదు. విడుదల తర్వాత మీరే భారీ రేట్స్ తో మా సినిమా రైట్స్ ని దక్కించుకోవడం కోసం పోటీ పడుతారు అని అన్నట్లు సమాచారం... దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ అన్ సేల్ గా మిగిలిపోయినట్లు తెలుస్తుంది...