సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది నటీనటులు  ఎవరో ఒకరి మీద తప్పకుండా మనసుపడతారు.. ఇందులో హీరోయిన్స్ అయితే మాత్రం  హీరోలతో లేదంటే బిజినెస్  మెన్స్, క్రికెటర్లతో లవ్ లో పడుతూ ఉంటారు. కొంతమంది వారి లవ్ ను సక్సెస్ చేసుకుంటే మరి కొంత మంది మధ్యలోనే వదిలేయడం ఎన్నో చూసాం. ఆ విధంగానే ఈ స్టార్ హీరోయిన్ కూడా ఆ హీరోతో లవ్ లో పడి అతను చేసే అతి వల్ల చివరికి బ్రేకప్ చెప్పేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే  అంజలి.. తెలుగు అమ్మాయి అయినా తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలందరితో నటించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా  పలు చిత్రాల్లో కీలకపాత్ర, రెండవ హీరోయిన్ గా కూడా నటించింది.. 

ఈ విధంగా అంజలి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతుంటే తమిళ హీరో జై పెట్టిన కండిషన్ల వల్ల కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు కూడా వదులుకోవాల్సి వచ్చిందట. అందుకే ఆమె ఆయనకు బ్రేకప్ చెప్పేసి నచ్చిన సినిమాలు చేస్తుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. జర్నీ సినిమా ద్వారా సుపరిచితుడు అయిన జై, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అంజలితో ప్రేమలో పడ్డారట. వీరిద్దరూ కొన్నాళ్లపాటు వీరి ప్రేమ వ్యవహారాన్ని  నడిపించుకుంటూ వచ్చారట. అంజలి ఎక్కడికి వెళ్లాలన్నా జై పర్మిషన్ తప్పకుండా తీసుకొని వెళ్లేదట..

అంతేకాదు ఆమె షూటింగ్ స్పాట్లోకి కూడా జై వచ్చేవాడట.. ఈ విధంగా జై కండిషన్లు ఎక్కువైపోయి ఆమె చేసే సినిమాలో కథలు కూడా ఆయనే ముందుగా వింటూ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయట. ఈ విధంగా అంజలి ఏ పని చేసినా అందులో జై పాత్ర ఉండాల్సిందే అని కండిషన్ పెట్టడం వల్ల విసిగిపోయిన అంజలి  చివరికి ఆయనకు బ్రేకప్ చెప్పేసింది.. ఆ తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో హీరోతో లవ్ లో పడిందని త్వరలోనే ఆయన ఎవరో కూడా బయటకు రానుందని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: