సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని మంచి మంచి సినిమాలను మిస్ చేసుకుంటూ ఉంటారు స్టార్ హీరోలు . మరీ ముఖ్యంగా బడా స్టేటస్ సంపాదించుకున్న తర్వాత అలా స్టార్ హీరోలు ఏదైనా సినిమాని మిస్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అవుతుంది . కాగా చాలామంది జనాలకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక్కటంటే ఒక్క సినిమాలోనైనా నటిస్తే బాగుండు అన్న కోరిక ఉంది . కానీ ఇప్పటికి  ఆ కోరిక నెరవేరలేదు . కానీ గతంలో మాత్రం ఒక సినిమాలో వీళ్ళ కాంబో సెట్ అవ్వాల్సింది . 


కానీ మిస్ అయిపోయింది . ఆ సినిమా మరేంటో కాదు "అ ఆ". త్రివిక్రమ్ చాలా చాలా టైంపాస్ చేస్తూ చేసిన మూవీ . కానీ హిట్ మాత్రం వేరే లెవెల్ లో ఉండింది. సమంత హీరోయిన్గా నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని  బాగా ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా మదర్ డాటర్ అదేవిధంగా ఫ్యామిలీ ఎమోషనల్ సెంటిమెంట్స్ తో చాలా చక్కగా తెరకెక్కించాడు త్రివిక్రమ్ అంటూ మాట్లాడుకున్నారు జనాలు.  అయితే ఈ సినిమా లో మొదటగా హీరోగా రాంచరణ్ ని అనుకున్నాడట త్రివిక్రమ్.



రామ్ చరణ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ రావాలి అనే విధంగా ఈ కథను వినిపించారట . కానీ కథ చాలా సింపుల్ గా ఉంది అని . చరణ్ స్టేటస్ కి సరిపోదు అంటూ మెగా ఫ్యామిలీ రేంజ్ ఇది కాదు అనే విధంగా పరోక్షంగా ఈ కథను రిజెక్ట్ చేశారట రామ్ చరణ్.  ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు - అల్లు అర్జున్ తో  ఒక సినిమా కి కమిట్ అయ్యాడు . కానీ ఈ సినిమా కొన్నాళ్లపాటు తెరకెక్క లేకపోవచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తుంది . కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకోరాబోతున్నారు . రామ్ పోతినేని తో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించబోతున్నారు అంటూ ఆలోచిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: