
సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి హిట్ అయ్యి.. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను దాటింది. ఇక ఇటీవలే ఈ సినిమా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం 12 గంటల్లోనే దాదాపు 13 లక్షల మంది చూశారు. ఇక ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వడంతో సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. అటు థియేటర్ లో ఇటు ఓటీటీలో రికారర్డులు సృష్టిస్తుంది.
ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో ఒక స్టార్ కమిడియన్ కూడా ఉండాల్సింది అంట. మరి ఆ స్టార్ కమిడియన్ ఎవరు అని ఆలోచిస్తున్నారా.. అదేనండీ నవ్విస్తూ ప్రేక్షకుల మనసును దోచుకున్న సప్తగిరి. ఈయన షూటింగ్ కోసం సెట్ కి కూడా వెల్లారంట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నటించలేకపోయారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సప్తగిరి అభిమనులతో పంచుకున్నారు. ఇక ప్రస్తుతం సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.