
కాశీ చరిత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు లీకైన పిక్స్ ఆధారంగా తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో మహేష్ బాబుని డ్యూయల్ షేడ్శ్ లో చూపించబోతున్నాడట . మహేష్ బాబు ఈ సినిమాలో చాలా చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు అంటూ లీకైన పిక్స్ ఆధారంగా తెలిసిపోతుంది. కాగా ఇలాంటి మూమెంట్లోనే రాజమౌళికి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఎస్.ఎస్ రాజమౌళి చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్.
అంత ఈజీగా ఎమోషనల్ అవ్వరు. కన్నీళ్లు పెట్టుకోరు . కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన "నాన్నకు ప్రేమతో" సినిమా చూసిన తర్వాత మాత్రమే ఆయన చాలా ఎమోషనల్ గా మారిపోయారట. రీజన్ ఏంటో తెలియదు కానీ ఆయన ఈ సినిమా చూసిన ప్రతిసారి తన తండ్రికి బాగా కనెక్ట్ అయిపోయాడట . అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా పట్ల చాలా చాలా ఎమోషనల్ గా స్పందించారు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది . 100 ఏనుగుల బలం ఉంది అని చెప్పుకునే రాజమౌళిని ఎమోషనల్ గా టచ్ చేసి కన్నీళ్లు పెట్టించిన వన్ అండ్ ఓన్లీ సినిమాగా "నాన్నకు ప్రేమతో" నిలిచిపోయింది . ఆ ఘనత సుకుమార్ కే దక్కింది . సుకుమార్ - రాజమౌళి మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే..!