
టాలీవుడ్ లో వచ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా ఏజెంట్ మిగిలిపోయింది .. సినిమా తర్వాత ఇప్పటివరకు అఖిల్ తన తర్వాతే సినిమా ఏంటి అనేది ప్రకటించలేదు .. అయితే మధ్యలో ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించిన అవి కన్ఫర్మ్ కాలేదు .. అయితే ఎప్పుడు తాజాగా కిరణ్ అబ్బవరం తో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను తెర్కక్కించిన మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం లో అఖిల్ హీరోగా లెనిన్ అనే సినిమా రాబోతుందనే ప్రచారం జరుగుతుంది .. అలాగే ఈ సినిమాలో అఖిల్ కు జంటగా శ్రీ లీల హీరోయిన్గా నటించిబోతుందట .
ఇక ఈ సినిమా రాయలసీమ చిత్తూరు నేపథ్యంలో సాగే పల్లెటూరి యాక్షన్ లవ్ స్టోరీ సినిమా అని తెలుస్తుంది .. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైందని తెలుస్తుంది .. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈనెల 14న హైదరాబాదులో మొదలు కాబోతుంది .. దాదాపు 20 రోజులపాటు సినిమా షూటింగ్ కొనసాగుతుందని ఫిలింనగర్ టాక్ . అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. అలాగే ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది .. మరి అఖిల్ ఈ సినిమాతో అయినా శ్రీ లీల కారణంగా మంచి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి .