టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటులు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి సినిమాతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని 100 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన ఓ హీరో ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా ..? ఆయన మరెవరో కాదు పంజా వైష్ణవ్ తేజ్. ఈ నటుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు.

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు కొండ పొలం , రంగ రంగ వైభవంగా , ఆది కేశవ అనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి.

ఇలా పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కెరియర్ను ప్రారంభించిన మొదటి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. దానితో ఈయన ఆ తర్వాత కూడా మంచి విజయాలను అందుకొని కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తాడు అని చాలా మంది భావించారు. కానీ ఈయన మాత్రం ఉప్పెన మూవీ తర్వాత నటించిన మూడు సినిమాలతో ఫ్లాప్ లని ఎదుర్కొన్నాడు. దానితో ఈయన కెరియర్ ప్రస్తుతం చాలా డౌన్ లో ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pvt