
అలాగే ఈ సినిమా షూటింగ్ పూర్తియి .. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి . అయితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 1న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. ఈ సినిమా తర్వాత మరో తమిళ దర్శకుడు నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య తన 45వ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ లో నటించబోతున్నాడని కూడా తెలుస్తుంది .. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2024 లో మొదలైంది .. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. అయితే ఈ సినిమా తర్వాత వాడివాసల్ సినిమాలో సూర్య నటించబోతున్నట్టు తెలుస్తుంది . అలాగే సూర్య టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది .
తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నారట .. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది .. సూర్యా తో పాటు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు అప్డేట్ బయటకు వచ్చింది .. అందులో హీరోయిన్ల గా నీది అగర్వాల్, భాగ్యశ్రీ బోరుసే ఈ సినిమాలో నటిస్తున్నారట .. ఇప్పటికే వెంకీ అట్లూరు డైరెక్షన్ వచ్చిన సార్ , లక్కీ భాస్కర్ సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి . ఇప్పుడు సూర్యాతో వెంకీ చేస్తున్న సినిమాపై కూడా త్వరలోనే అధికార ప్రకటన బయటకు రానుంది .