సోషల్ మీడియా ప్రభావం జనాల్లో బాగా పెరిగిన తర్వాత అనేక మంది నటీ నటులు , సెలబ్రిటీలు తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి మాళవిక మోహన్ కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించేందుకు రెడీ కాగానే అనేక మంది ఈమెతో చాటింగ్ చేయడానికి అందుబాటు లోకి వచ్చేసారు. అందులో భాగంగా ఓ అభిమాని ఈమెతో చేసిన చాటింగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... మాళవిక మోహన్ తో ఒక అభిమాని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను.  మీరు కోరుకునే మంచి భర్తగా ఉండేందుకు నేను ఏం చేయాలి అని ప్రశ్నించాడు. దానికి మాళవిక మోహన్ నేను ఇప్పుడు పెళ్లికి సిద్దంగా లేను. ఇప్పుడు నాకు భర్త వద్దు అని సమాధానం ఇచ్చింది. ఇక మాళవిక మోహన్ ఇచ్చిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అయింది. మాళవిక చాలా సమయం ఆన్ లైన్ లో తన అభిమానులతో ముచ్చటించి అనేక మంది అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఇకపోతే తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. దానితో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈ బ్యూటీ కి తెలుగు లో సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: