ప్రభాస్ ..చాలా చాలా సైలెంట్ పర్సన్. పేరుకు పెద్ద పాన్ ఇండియా హీరో. కానీ స్టేజ్ పైకి వస్తే మైక్ పట్టుకోవడానికి గజగజ వణికి పోతూ ఉంటాడు . అలాంటి సందర్భాలను మనం ఎన్నెన్నో చూసాం. మరీ ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళినే ప్రభాస్ అంత టాకిటివ్ కాదు అని ..ప్రభాస్ చాలా చాలా బద్ధకస్థుడు అని సినిమాల కోసం ఏదైనా చేస్తాడు కానీ పరసనల్ లైఫ్ పరంగా మాత్రం ఒక పని చేయడానికి చాలా టైం వేస్ట్ చేస్తాడు అని .. ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు . అంతే కాదు ప్రభాస్ కూడా ఆ విషయాన్ని ఒప్పేసుకున్నారు . అలాంటి ప్రభాస్ ఒక సినిమా షూట్ నుంచి కోపంగా వెళ్ళిపోయాడు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .


ప్రభాస్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ బడా హీరో.  ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు అందుకుంటూ ఉంటాడు. అలాంటి స్టార్ కి కోపం తెప్పించాడు ఒక డైరెక్టర్ అంటూ జనాలు అప్పట్లో మాట్లాడుకున్నారు . ఆ సినిమా మరేంటో కాదు "రాధే శ్యామ్ " . సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్  క్రియేట్ చేస్తుంది ఈ సినిమా అంటూ అంతా భావించారు. సీన్ కట్ చేస్తే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించింది.  ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది .



ఆ సాంగ్ లో పూజ హెగ్డే ప్రభాస్ కోసం హద్దులు మీరుతూ నటించాల్సి ఉంటుంది . కానీ మొదటగా ప్రభాస్.. ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదట . అంతేకాదు డైరెక్టర్ ఈ సాంగ్ చెప్పగానే కోపంతో షూట్ నుంచి వెళ్ళిపోయారట . ఆ తర్వాత నెమ్మదిగా మేకర్స్ కన్విన్స్ చేసి కొన్ని కొన్ని సీన్స్ లేపేసి ప్రభాస్ కి కంఫర్టబుల్గా ఉన్న సీన్స్..  పెట్టి సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశారట . ప్రభాస్ మహా మహా సిగ్గు మనిషి. అలాంటి ప్రభాస్ ఇలాంటి ఒక రొమాంటిక్ సాంగ్ డిజైన్ చేయడమే ఆ డైరెక్టర్ తప్పయింది అంటూ అప్పట్లో జనాలు కూడా మాట్లాడుకున్నారు.  మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయింది . కానీ ఆ దేవుడు మాత్రం కరుణించలేదు సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: