ప్రస్తుతం కొంత మంది హీరోయిన్లు అదిరిపోయే రేంజ్ లో విజయాలను అందుకుం టు అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. అలా సూప ర్ సాలిడ్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న హీరోయి న్స్ ఎవరో తెలుసుకుందాం.

రష్మిక మందన : ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. పోయిన సంవత్సరం ఈమె నటించిన పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సంవత్సరం ఈమె నటించిన ఛావా అనే హిందీ సినిమా విడుదల అయింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

సాయి పల్లవి : ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన తండెల్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మీనాక్షి చౌదరి : ఈ మధ్య కాలంలో ఈమెకు మంచి విజయాలు దక్కుతున్నాయి. పోయిన సంవత్సరం ఈమె నటించిన లక్కీ భాస్కర్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక ఈ సంవత్సరం ఈ బ్యూటీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: