
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి బయటికి రావడంతో ఒక్కసారిగా మేకర్స్ షాక్ తిన్నారు .. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇది ఎలా బయటికి వచ్చిందా అంటూ తల పట్టుకుంటున్నారు .. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒరిస్సాలో జరుగుతుంది. అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో 25 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రాజమౌళి .. మహేష్ సహా కీలక ఆర్టిస్టులపై ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది .. అయితే ఈ షూటింగ్ సెట్ నుంచి దాదాపు 13 సెకండ్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఇప్పుడు మహేష్ రాజమౌళి సినిమా లీక్స్ లో ఇది రెండో వీడియో .. రీసెంట్ గానే హైదరాబాదులో వేస్తున్న సెట్ ఫోటోలు కూడా ఇలాగే బయటకు వచ్చాయి .
SSMB 29 తర్వాతి షెడ్యూల్ కోసం కాశి సెట్ వేస్తున్నారు చిత్ర యూనిట్ .. ఎంతో అత్యంత భారీగా ఈ సెట్ నిర్మాణం జరుగుతుంది .. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి .. ఈ ఫోటోలు కూడా లీక్ అవ్వటం కూడా హాట్ టాపిక్ గా మారాయి . అయితే సాధారణంగా ప్రతి సినిమాకు ముందు కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేసేవాడు రాజమౌళి .. కానీ మహేష్ సినిమా విషయంలో మాత్రం ఎంతో కఠినంగా ఉంటున్నాడు రాజమౌళి .. కనీసం ఒక్క ఫోటో కూడా బయటికి రిలీజ్ చేయట్లేదు .. అందుకే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఏది లీక్ అయిన నిమిషాల్లో వైరల్ చేస్తున్నారు అభిమానులు .. అయితే ఇప్పుడు ఈ లీక్ లపై చాలా సీరియస్ గా ఉన్నారు సినిమా టీం .. దీనికి ఎక్కడ పులిస్టాప్ పడుతుందో చూడాలి .