
అంతేకాకుండా బన్నీ కెరీర్ లో మొదటి 40 కోట్లు షేర్ రాబట్టిన సినిమా కూడా ఇదే .. ఆ తర్వాత వీరి కాంబోలో సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో లాంటి హిట్ సినిమాలు కూడా వచ్చాయి . ఇలా తన కెరియర్ను మరో లెవల్ కు తీసుకువెళ్లి త్రివిక్రమ్‌కు నో చెప్పి మరో దర్శకుడువైపు అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నారా ..? అయితే ఇక్కడ పరిస్థితులు మరోలా మార్చేశాయి .. నిజానికి పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ సినిమా ముందు ఉండాలి .. కానీ ఒక అండర్ స్టాండింగ్ ప్రకారమే త్రివిక్రమ్ కంటే అట్లీ సినిమా ముందుకు వచ్చేసింది .. దీని వెనక కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది .. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది . త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు .. పక్కగా ఈ సినిమా ఉంటుంది .. అలాగే బన్నీ కెరీర్ లోని అతిపెద్ద బడ్జెట్ సినిమా కూడా ఇదే ..
ఇక ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే కాస్త ఆలస్యంగా మొదలవుతుందని తెలుస్తుంది .. అందుకే ఏడాదిలోపే ఓ సినిమాని కంప్లీట్ చేయాలని కండిషన్తో అట్లీకి అవకాశం ఇచ్చారు అల్లు అర్జున్ ,, అదే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు . అలా అట్లీ సినిమా కంప్లీట్ అయ్యేలోపు .. బన్నీ కోసం బౌండర్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు త్రివిక్రమ్ .. భారీ స్పాన్ ఉన్న మైథాలజికల్ స్టోరీ ఇది .. అంతా కుదిరితే 2 పార్ట్స్ చేయాలని ఆలోచన కూడా ఉన్నారు .. అందుకే టైం తీసుకున్న పర్లేదు కానీ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాకే రంగంలోకి దిగాలని బన్నీ , త్రివిక్రమ్ చూస్తున్నారు .. ఈ సినిమా ఆలస్యానికి కారణం కూడా ఇదే .. వచ్చే 2026 సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది .