చిన్న హీరోలలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న కిరణ్ అబ్బవరం గత సంవత్సరం దీపావళికి విడుదలైన ‘క’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈమూవీలో అతడి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు కూడ లభించాయి. దీనితో వరస పరాజయాలతో సతమతమైపోతున్న అతడి కెరియర్ కు బ్రేక్ పడినట్లు అయింది.


ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదలకాబోతున్న ‘దిల్ రుబా’ అతడి కెరియర్ కు పరీక్ష పెట్టబోతోంది. వాస్తవానికి ఈమూవీని ‘క’ మూవీ కంటే ముందుగా విడుదలచేద్దామని భావించారు. అయితే ఆమూవీ మార్కెట్ అనుకున్నంత ఆశాజనకంగా జరగక పోవడంతో ఆమూవీ విడుదల ఆలస్యం అయింది. అయితే ‘క’ మూవీతో కిరణ్ అబ్బవరం మార్కెట్ ఒక్కసారిగా బాగా పెరిగిపోవడంతో ఇప్పుడు ఈసినిమాను ఈవారం విడుదల చేస్తున్నారు.


అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో డల్ సీజన్ నడుస్తోంది. విద్యార్ధులకు పరీక్షలు సీజన్ కావడంతో విద్యార్థులు అంతా చాల బిజీగా ఉన్నారు. దీనికితోడు ఈసినిమా ప్రమోషన్ కూడ అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల మధ్య ఈమూవీని ధైర్యంగా ఈవారం విడుదల చేస్తున్నారు.   సినిమాలో హీరోకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. తరుచు ఆవేశానికి లోనయ్యే ఈ హీరో పాత్ర ‘అర్జున్ రెడ్డి’ మూవీలోని విజయ్ దేవరకొండ పాత్రను పోలి ఉంటుంది.


విపరీతమైన కోపంతో అతడు ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతాడు. దీనితో ‘అర్జున్ రెడ్డి’ ఛాయలతో ఉన్న ఈసినిమాను ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఈమూవీలో హీరోయిన్ గా నటించిన రుక్సర్ ధిలాన్ లీడ్ హీరోయిన్ గా నటించిన సినిమాలు తెలుగులో ఇప్పటివరకు రాలేదు. దీనితో ఆమె కెరియర్ కు ఈమూవీ చాల కీలకంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అవుతున్న ఈమూవీ అటు హీరోకు ఇటు హీరోయిన్ కు కూడ కీలకంగా మారింది. దీనితో కిరణ్ అబ్బవరం అదృష్టం ఎలా ఉంది అన్న విషయం ఈవారం తెలిపోతుంది..






మరింత సమాచారం తెలుసుకోండి: