హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో విక్కీ కౌశల్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఛావా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది.

భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం హిందీ లో విడుదల అయిన ఈ సినిమాకు సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఈ మూవీ కి భారీ కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ ని తెలుగు లో డబ్ చేసి తాజాగా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు వర్షన్ కి సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ ఐదు రోజుల్లో ఈ మూవీ తెలుగు వర్షన్ కి కూడా సూపర్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ తెలుగు వర్షన్ కి ఐదు రోజుల్లో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే దానిని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ బృందం తాజాగా ఛావా మూవీ తెలుగు వెర్షన్ కి 5 రోజుల్లో 11.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సూపర్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: