కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ నీ కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తాను నటించిన చాలా సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

తాజాగా ఈ నటుడు విడ మియర్చి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్లను విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి దాదాపు 142 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా కోలీవుడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ "రిటన్ ఆఫ్ ది డ్రాగన్" అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది.

ఇక ఈ మూవీ కి విడుదల అయిన తర్వాత అద్భుతమైన టాక్ ప్రేక్షకుల నుండి వచ్చింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం కూడా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా అజిత్ హీరోగా రూపొందిన విడ ముయర్చి వసూలు చేసిన కలెక్షన్ల కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak